upgradation-of-Language-Pandits-Posts-in-High-schools-as-S.A

upgradation-of-Language-Pandits-Posts-in-High-schools-as-S.A

Abstract: Go ms no 73 dt:8-11-18 Upgradiation of language pandit posts in to High schools as school assistant language pandit and physical education in government & zp schools Filling up of posts orders issued..

                      1450 ఉన్నతీకరణ పోస్టులలో మిగిలిన 30%  కూడా పదోన్నతులు కల్పిస్తూ  ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు GOMS NO 73. ప్రభుత్వ ఉత్తర్వులు 11 /12 లోని 30 % Direct Recruitment నుండి  వెసులుబాటు కల్పిస్తూ, పదోన్నతులు కల్పించాలని ఉత్తర్వులు విడుదల చేసిన విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  శ్రీ ఆదిత్యనాథ్ దాస్ గారికి విద్యాశాఖ సంచాలకులు సంధ్యా రాణి గారికి ధన్యవాదములతో…… పండిత పరిషత్

పండిత పరిషత్ మరో ఘన విజయం*

*2017 పదోన్నతులలో మిగిలిన 30 శాతం పదోన్నతులు నేరుగా నింపేందుకు అనుమతి*

*జీ. ఓ.73 నేడు విడుదల* 


*ప్రభుత్వం గతంలో 30శాతం పదోన్నతులను ఇవ్వడం కుదరదని ఇచ్చిన జీవో వెనక్కి తీసుకుంది*

11,12 జీవోలలో రూల్-3(3)ప్రకారం 100 శాతం పదోన్నతులు కుదరవని గతంలో జీవో జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని రద్దు చేస్తూ.. upgraded పోస్టులు అన్నీ ఫీడర్ క్యాడర్ నుంచి పదోన్నతుల ద్వారా నింపాలని  జీవో 73 ద్వారా ఆదేశించింది..

తాజా 14, 15 జీవోల ప్రకారం ఫీడర్ క్యాడర్ భాషాపండితులే కావున….

100 శాతం పదోన్నతులు భాషా పండితులకు దక్కనున్నాయి….

 రాష్ట్రంలోని భాషా పండిత పోస్టులన్నింటినీ  ఉన్నతీకరణ చేస్తూ విద్యా శాఖ, ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయం, అలాగే క్యాబినెట్ ఆమోదం పొందడం వెనుక పండిత పరిషత్ నిరంతర కృషి, చేసిన ప్రాతినిధ్యాలు, ఉద్యమ  పోరాటాల ఫలితమేనని పండిత పరిషత్ సగర్వంగా చెబుతోంది.

ఇది ముమ్మాటికీ పండిత పరిషత్ విషయమే.  ఇది ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు. చరిత్రను గమనించండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు  2007లో మహాధర్నా, 2008 జూన్లో ఆరు రోజులు నిరాహార దీక్షలు, 2010 సెప్టెంబర్ 14న మహాధర్నా, డిసెంబర్ 1 నుండి 9, 10, తరగతుల బహిష్కరణ, 2011 జనవరిలో జిల్లాస్థాయి ధర్నా కార్యక్రమాలు, 2011 మే నుండి 8 వరకు ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో సాహసోపేతమైన పాదయాత్ర, 2012 డిసెంబర్లో 20 నుండి 25 వరకు సామూహిక నిరాహార దీక్షలు, 62012 డిసెంబర్ 27న తిరుపతిలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆమరణ నిరాహారదీక్షకు ప్రకటన, అలాగే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం లో 2015 జనవరి 22న జిల్లాస్థాయి ధర్నా కార్యక్రమాలు, 2015 ఫిబ్రవరి 1 నుండి 3 వరకు విజయవాడలో నిరాహారదీక్షలు, 2015 జూన్ 20న విజయవాడలో మహాధర్నా, 2016 జులై 1 నుండి 3 వరకు విజయవాడలో నిరాహారదీక్షలు, మహా ప్రదర్శన, 2017 అక్టోబర్ 12 డివిజన్ స్థాయి ధర్నా, 2017 అక్టోబర్ 26 జిల్లాస్థాయి ధర్నా, 2017 నవంబర్ 16  విజయవాడలో మహాప్రదర్శన, మహా ధర్నా చేపట్టడం జరిగింది. అలాగే ఇటీవల అక్టోబరులో విజయవాడలో ఆత్మగౌరవ దీక్షలు కూడా చేపట్టడం జరిగింది. ఇలా ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాల ఫలితమే ఈ రోజు భాషాపండిత పోస్టులను ఉన్నతీకరణ చేయడం జరిగింది.

ఈ ఉద్యమాలు, పోరాటాలలో పాల్గొన్న ప్రతి భాషా పండితుడికి, పండిత పరిషత్ జిల్లా బాధ్యులకు, రాష్ట్ర బాధ్యులు అందరికీ కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. ఇది కేవలం భాషాపండితుల విజయం. పండిత పరిషత్ సాధించిన అత్యంత ఘనమైన విజయం. అందుకు సాక్షి భూతాలే ఈ ఉద్యమాలు పోరాటాలు. ఎవరెవరో మేం చేశామని, మేం సాధించామని ముందుకు వస్తున్నారు.

పండిత మిత్రులారా! విజ్ఞతతో ఆలోచించండి. వాస్తవాలు తెలుసుకోండి. ధన్యవాదాలతో……. మీ పండిత పరిషత్. 




G.O.NO.73, DATED, 08-11-2018 ABOUT PANDITS PROMOTION CLICK HERE