Here by declare *SPECIAL CASUAL LEAVE* on March 8th _*as it is being celebrated as INTERNATIONAL WOMEN’s DAY to all Women Employees in the state*_
ఇందు ఎక్కడ కూడా *మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఉద్యోగినులకు మాత్రమే స్పెషల్ క్యాజువల్ లీవ్ ను మంజూరు చేయాలని కాని, పాల్గొనని వారికి మంజూరు చేయకూడదనికాని లేదు.* చాలా స్పష్టంగా *మహిళా ఉద్యోగులందరికీ* అని ఉన్నది. కావున అందరు మహిళా ఉద్యోగులు ఉపయోగించుకోవచ్చు. అయితే *పాఠశాల మూతపడకూడదు*.
ప్రశ్న: స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉపయోగించుకున్న ఉద్యోగిని తప్పనిసరిగా అటెండెన్స్ సర్టిఫికేట్ సమర్పించవలెనా?
సమాధానం: *సమర్పించనవసరం లేదు.*
ఆన్ డ్యూటీ పై వెళ్లిన ఉద్యోగులు మాత్రమే తప్పనిసరిగా అటెండెన్స్ సర్టిఫికెట్ సమర్పించవలెనను అయితే *ఇక్కడ ఉద్యోగిని ఆన్ డ్యూటిపై వెళ్లట్లేదు* కాబట్టి స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉపయోగించుకున్న ఉద్యోగినిని అటెండెన్స్ సర్టిఫికేట్ సమర్పించమని అడగడం *అర్థరహితం, అవగాహన లేమి.*
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (Mar.08) -అంతర్జాతీయ మహిళా దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.
మార్చి 8 ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత గల రోజు. పదిగంటల పనిదినాలకోసం, పురుషులతో సమానమైన వేతనాలకోసం పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఒక బట్టల మిల్లులో సమ్మె ప్రారంభమైంది. ఇందులో 5000 మంది పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. చివరకు 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమైంది. అందుకే ఆరోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంతటి ప్రాధాన్యతల గల 8వ తేదీ ముంగిట్లో… మార్కెట్ యుగంలో మహిళ స్థితిగతులను పరిశీలిద్దాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దేశం, జాతి, భాష, రాజ్యం, సాంస్కతిక భేదభావాలకు తావు లేకుండా మహిళలందరూ ఒకచోట చేరి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటారు. చరిత్రను అనుసరించి సాధికారత సాధన దిశగా మహిళలు పోరాటానికి అంకురార్పణ చేశారు.
మహిళా సంరక్షణలో భారతీయ చట్టాలు
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు గడచిన దశాబ్ద కాలంగా భారీ సంఖ్యలో చట్టాలు రూపుదిద్దుకున్నాయి. అయితే ఈ చట్టాలు సక్రమంగా అమలుకు నోచుకుని ఉన్నట్లయితే భారత దేశంలో మహిళల పట్ల వివక్ష మరియు అత్యాచారాలు ఈ సరికే ముగిసిపోయి ఉండేవి. కానీ పురుషాధ్యికత విశృంఖలమైన పరిస్థితులు ఈ అద్భుతం ఆవిష్కరణకు అడ్డుపడ్డాయి. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకు ఈ చట్టాలు అమలుకు నోచుకుంటున్నాయి. భారతదేశంలో స్త్రీలను కాచుకోవడంలో చట్టాలను మించినవి మరేవీ కానరావు. భారతీయ సంవిధానంలోని ప్రతి అంశం కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ రూపుదిద్దుకుంది. ఈ విషయమై మహిళలు సంపూర్ణమైన అవగాహనను కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.
చట్టం ఇలా అంటోంది- * కార్యక్షేత్రంలో స్త్రీపురుషులకు సమానమైన వేతనాన్ని ఇవ్వాలి. * మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు మరియు స్నానాల గదులు ఏర్పాటు చేయాలి. * ఏ మహిళను కూడా దాస్యభావంతో చూడరాదు. * బలాత్కారం నుంచి బయటపడేందుకు అవసరమైతే సదరు పురుషుని హత్య చేసే అధికారం మహిళకు ఉంది. * వివాహితురాలైన హిందూ మహిళకు తన ధనంపై సర్వాధికారాలు ఉంటాయి. తన ధనాన్ని ఏ విధంగానైనా ఖర్చు పెట్టుకునే అధికారం ఆమెకు ఉంటుంది. * వరకట్నం తీసుకోవడం లేదా ఇవ్వడం చట్టవిరుద్ధం.